Header Banner

కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఇక వారికి పండగే పండగ! త్వరలో 8వ వేతన సంఘం ప్యానెల్!

  Thu Apr 24, 2025 19:36        Politics

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త శాలరీలు, పెన్షన్లు నిర్ణయించే 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ఏర్పాటు చేయడానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకుంటోంది. కొత్త పే కమీషన్‌ ఏర్పాటు ప్రకటన వెలువడి కొన్ని నెలలు గడిచిపోయాయి.

 

కానీ ఇంకా కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR), దాని ఛైర్మన్, మెంబర్స్‌ పేర్లు ఖరారు కాలేదు. ఇవన్నీ రాబోయే రెండు, మూడు వారాల్లో ఫైనలైజ్‌ అవుతాయని అధికారులు చెబుతున్నారు. శాలరీల పెంపు ఆసక్తిగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది కార్మికులు, పెన్షనర్లకు ఇది పెద్ద గుడ్‌న్యూస్‌.

 

ఇది కూడా చదవండివారికి గుడ్‌న్యూస్! రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. త్వరలోనే ఆ పథకం అమల్లోకి!

ఈ సంఘం కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతరులను సంప్రదిస్తుంది. ఫైనల్‌ రిపోర్టు 2026 మధ్య నాటికి వెలువడే అవకాశం ఉంది. కొత్త శాలరీలు, పెన్షన్లు 2026 జనవరి 1 నుంచి అమలు చేయవచ్చు. పే కమీషన్‌ రిపోర్టు సబ్మిట్‌ చేశాక ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను (Arears) చెల్లించే అవకాశం ఉంది.

 

8వ పే కమిషన్‌ ప్రోగ్రెస్‌

ToRను ఖరారు చేయడం, కమిషన్ సభ్యులను ఎంపిక చేయడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని ఒక అధికారి తెలిపారు. గత వారం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ 8వ CPC కోసం 35 ఉద్యోగ ఖాళీలను డిప్యుటేషన్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది కమిషన్‌ను త్వరగా ప్రారంభించడం, అమలు చేయడంపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టిందని సూచిస్తోంది.


7వ వేతన సంఘం ప్రభావం

7వ CPC 2014 ఫిబ్రవరిలో జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ ఆధ్వర్యంలో ఏర్పాటైంది. ఇది 18 నెలల్లో రిపోర్ట్‌ సమర్పించింది. కొత్త శాలరీలు, పెన్షన్లు 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ కమిషన్ ఉద్యోగులకు 23.55% శాలరీ ఇంక్రిమెంట్‌ అందించింది. దీనివల్ల ప్రభుత్వానికి 2017లో రూ.1.02 లక్షల కోట్లు లేదా భారతదేశ GDPలో 0.65% నష్టం వాటిల్లింది. ఫలితంగా ప్రభుత్వం ఆర్థిక లోటును 3.9% నుంచి 3.5%కి తగ్గించడానికి కష్టపడింది.

 

7వ CPC పాత పే బ్యాండ్‌లు, గ్రేడ్ పే సిస్టమ్‌ని రీప్లేస్‌ చేసి కొత్త ‘పే మ్యాట్రిక్స్ (Pay matrix)’ను ప్రవేశపెట్టింది. ఇది స్టాండర్డ్‌ మంత్లీ శాలరీ రూ.18,000 (డియర్‌నెస్ అలవెన్స్‌ సహా), టాప్ పే రూ.2.5 లక్షలుగా నిర్ణయించింది. కొత్త జీతాలను లెక్కించడానికి 2.57 ‘ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్’ను కూడా సిఫార్సు చేసింది. యాన్యువల్‌ పే ఇంక్రిమెంట్‌ని 3% వద్ద ఉంచింది.


ఇది కూడా చదవండిఏపీలో ట్రిపుల్ ఐటీ (IIIT) కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి డిటైల్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

* ఎవరు ప్రయోజనం పొందుతారు?

8వ పే కమిషన్‌ ఏర్పాటుతో రక్షణ సిబ్బంది సహా దాదాపు 5 మిలియన్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 6.5 మిలియన్ల పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వారు లక్షలాది మంది జీతాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రాలు తరచుగా CPC సిఫార్సులను అనుసరిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు కూడా వారి పే స్కేల్స్‌ని అడ్జస్ట్‌ చేయవచ్చు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్! ప్రైవేట్ స్కూల్‌లో ఉచిత సీటు పక్కా.. దరఖాస్తులు ప్రారంభం!

 

రోజూ ఆఫీసుకు విమానంలో వెళ్తున్న మహిళ! తనకదే చీప్ అట గురూ..!

 

తిరుమలలో హైఅలర్ట్‌.. భద్రత కట్టుదిట్టం! అనువనువు గాలిస్తున్న పోలీసులు?

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #8thPayPanel #GovtEmployees #PensionUpdate #PayRevision #GoodNews #SalaryHike